ప్రధాని మోదీకి నా పుల్ సపోర్ట్ : రజనీ
క్లీన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగంగా భారత ప్రభుత్వం తలపెట్టిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగం కావాలని ఐకానిక్ పర్సనాలిటీస్‌కి నరేంద్ర మోదీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, బిజినెస్ ఇలా పలు రంగలలో ఉన్నత స్థానంలో ఉన్న వారికి లేఖ రాస్తూ, మీ పాపులారిటీతో ప్రజలతో చైతన్యం తేవాలని కోరారు. ఈ క్రమంలో రజనీకాంత్ సపోర్ట్ కూడా కోరారు మోదీ. ప్రధాన మంత్రి లేఖకి వెంటనే స్పందించిన రజనీకాంత్ తన ట్విట్టర్ ద్వారా అభిప్రాయాన్ని తెలియజేశారు. మీరు తలపెట్టిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమానికి నా పుల్ సపోర్ట్ ఇస్తానంటూ మోదీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అంతేకాక దేశ పరిశుభ్రత దైవభక్తితో సమానమని అయన అన్నారు.













