కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌గాందీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి నామినేషన్ తిరస్కరణ గడువు నేటితో ముగిసింది. రాహుల్ మినహా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ ఎం. రామచంద్రన్ ప్రకటించారు. డిసెంబర్ 16న రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. పార్టీ సారథిగా రాహుల్ ఎన్నికతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షాతికేరాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.













