కరోనాను తేలిగ్గా తీసుకోండి…అంటున్న సైకాలజిస్ట్ లు
కరోనా రాకున్నా వచ్చినట్లుగానే, మనకు వస్తుందేమోనన్న భయంతో చాలామంది నేడు బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ పెద్ద జబ్బేమి కాదని, దాని గురించి అంతగా భయపడాల్సిన పనిలేదని, జాగ్రత్తలు తీసుకుంటే అది మన జోలికి రాదు. ఒకవేళ వచ్చినా ఏమీ కాదంటున్నారు సైకాలజిస్టులు. తాము చెప్పినట్లు చేస్తే… చాలా ఈజీగా ఈ వైరస్ బాడీ లోంచీ బయటకు వెళ్లిపోతుందని అంటున్నారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ పాజిటివ్‌గా ఉండాలంటున్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గని రోగాలు… సంతోషంతో, పాజిటివ్ ఎనర్జీతో తగ్గుతున్నాయనీ, ఇదే ఫార్ములా కరోనా వైరస్‌కి కూడా పనిచేస్తుందని అంటున్నారు. మనం సంతోషంగా, పాజిటివ్‌గా ఉన్నప్పుడు మన బాడీలో కణాలన్నీ ఉత్తేజంతో ఉంటాయి. అలాగే బాడీలోని మంచి బ్యాక్టీరియా కూడా ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. ఇలాంటప్పుడు కరోనా వైరస్ బాడీలోకి వెళ్తే… మంచి బ్యాక్టీరియా బలంగా పోరాడి వైరస్‌ను తరిమికొడుతుంది. కణాలు కూడా వైరస్‌కి సహకరించవు. అందుకే మనం పాజిటివ్‌గా ఉండాలంటున్నారు.













