త్వరలోనే ప్రధాని మోడీ అమెరికా పర్యటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ త్వరలోనే అమెరికాలో పర్యటించనున్నారు. జూన్ నెలాఖరులో శ్వేతసౌధంలో ఇరు దేశాధినేతలు కలుసుకుని పలు కీలకమైన అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నాం. జూన్ నెలాఖరుకు ఆయన వాష్టింగ్టన్ వచ్చే అవకాశం ఉంది అని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి హేథర్ న్యూర్ట్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత తొలిసారిగా ప్రధాని శ్వేత సౌధానికి వెళ్లనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ మూడు సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారు.













