మోదీ ట్విటర్ శుభాకాంక్షలు
రెండు తెలుగు రాష్ట్రాలు ప్రగతి పథంలో నడవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ట్విటర్ ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సిరిసంపదలతో ముందుకు దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను హుషారైన వారిగా పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ కొత్త శిఖరాలకు చేరాలని కోరుకున్నారు. దేశ ప్రగతిలో తన పాత్రను ఏపీ కొనసాగించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు.













