తెలుగు రాష్ట్రాలకు ఎన్ టీపీసీ షాక్ ?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు గడువులోపు బకాయిలు చెల్లించకపోతే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని ఎన్టీపీసీ హెచ్చరించింది. ఫిబ్రవరి 9ని తుదిగడువుగా నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు విద్యుత్ సరఫరా నియంత్రణ నోటీసులను ఎన్టీపీసీ ఆయా రాష్ట్రాలకు జారీ చేసింది. గత రెండు నెలల పైబడి బకాయిలు చెల్లించకపోవటం వల్లే వీటిని జారీ చేసినట్లు ఎన్టీపీసీ తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రూ.7,859 కోట్ల బకాయిలు పెండింగ్‌లు ఉన్నాయని ఎన్టీపీసీ వెల్లడించింది. ఇందులో అగ్ర భాగం రూ.4,890 కోట్లు బకాయిలు కేవలం ఈ మూడు రాష్ట్రాల నుంచే రావాల్సి ఉందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.













