వివాహాలు రిజిస్టర్ చేసుకోని ఎన్నారైల పాస్ పోర్టు రద్దు
భారతీయ యువతులను వివాహం చేసుకునే ప్రవాస భారతీయులు (ఎన్నారై) 30 రోజుల్లోపలే తమ పెళ్లిని తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవడానికి ఉద్దేశించిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 30 రోజుల్లో పెళ్లి రిజిస్టర్ చేయని పక్షంలో సదరు ఎన్నారై పాస్‌పోర్టును అధికారులు స్వాధీనం చేసుకుంటారు లేదంటే రద్దు కూడా చేయవచ్చు. సాటి ప్రవాస భారతీయ యువతులను చేసుకున్నా సరే ఈ నిబంధన వర్తిస్తుంది. భారత యువతిని లేదా సాటి ఎన్నారైని చేసుకున్నా సరే ఆ పెళ్లిని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవలసిందేనని రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ ఎన్ఆర్ఐ బిల్-2019 సృష్టంగా నిర్దేశిస్తోంది.













