ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి ఇక లేరు
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి (46) కన్ను మూశారు. కొంతకాలంగా ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నారు. రెండు రోజులుగా ఆయన వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. గురువారం అవుకులో ఆయన అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. భగీరథరెడ్డి 2003 నుంచి 2009 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా 2007-08 మధ్య ఆలిండియా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. 2019లో తండ్రితో కలిసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. చల్లా రామకృష్ణా రెడ్డి మృతితో ఆయన రెండో కుమారుడైన భగీరథరెడ్డికి 2021 మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం లభించింది.













