బద్వేల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాసరి సుధ ఘన విజయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన వైసీపీ అభ్యర్థి దాసరి సుధా విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 90 వేల పైగా మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ ఆధిక్యం ముందు ఇతర పార్టీలేవి నిలబడలేకపోయాయి. మొత్తం 13 రౌండ్లు ముగిసే సరికి వైసీపీకి 1,12,072, బీజేపీ 21,661 కాంగ్రెస్కు 6,217, నోటాకు 3,639 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికే సుధ విజయం ఖరారైపోయింది. ఇతర పార్టీలు దాదాపు పోటీ ఇవ్వలేకపోయాయని అధికార పార్టీ నేతలు తెలిపారు.













