పార్వతీపురం సభలో వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు
– 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు పరిపాలన చూశాం. విజయనగరం జిల్లాకు ఈ 5 ఏళ్లలో చేసింది ఏమని చూస్తే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది.
– 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పాడో మనకు తెలుసు. ఇప్పుడు మళ్లీ ఇలాంటి డ్రామాలు, మోసాలే కనిపిస్తున్నాయి.
– ఈ జిల్లాకు ఏమన్నా మంచి జరిగింది అంటే, అది దివంగత మహానేత వైయస్సార్ హయాంలోనే. మనకు తోటపల్లి ప్రాజెక్టు కనిపిస్తుంది.
– ఆయన సీఎం కాగానే రూ.450 కోట్ల ఆ ప్రాజెక్టులో రూ.400 కోట్లు ఖర్చు చేసి దాదాపు 90 శాతం పనులు ఆయన పూర్తి చేశారు.
– మిగిలిన 10 శాతం పనులు చంద్రబాబు పూర్తి చేయలేదు. దీంతో 1.25 లక్షల ఎకరాలకు గానూ ఇప్పుడు 80 వేల ఎకరాలకు మించి నీరందడం లేదు.
– ఒడిసాతో వివాదం ఉండడంతో ఎవరూ జంఝావతి ప్రాజెక్టు చేపట్టలేదు. కానీ ఆ మహానేత దాన్ని చేపట్టి రబ్బర్ డ్యామ్ కట్టారు.
– పార్వతీపురం పురపాలక సంఘంలో తాగనీటి సమస్య ఉంది. నాగావళి నదిలో నేలబావులు పాడై పోతే ఈ నాలుగున్నర ఏళ్లలో పట్టించుకున్న వారే లేరు.
– పార్వతీపురంలో 100 పడకల ఏరియా ఆస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా చేస్తామని చెప్పిన హామీ అమలు కాలేదు.
– ఈ ప్రాంతమంతా కూడా అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువ. దారి పొడవునా నా పాదయాత్రలో నేను చూశాను.
– ఈ 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు వారిని ఆదుకోవల్సింది పోయి అన్యాయం చేశారు.
– సంస్థ ఆస్తులను చంద్రబాబు, ఆయన బినామీలు కాజేశారు.
– పాదయాత్రలో అందరి కష్టాలు చూశాను. అందుకే అందరికీ మాట ఇస్తున్నాను. అదే ‘నేను ఉన్నాను’.
– రైతుల రుణ మాఫీ జరగలేదు. గిట్టుబాటు ధర కూడా లేక వారు చాలా ఇబ్బంది పడ్డారు.
– హెరిటేజ్ లాభాల కోసం చంద్రబాబు స్వయంగా దళారీలా మారి, వారి నాయకుడయ్యాడు. ఇక రైతులకు ఎలా ప్రయోజనం కలుగుతుంది?.
– అసైన్డ్ భూములను అత్తగారి సొత్తు అయినట్లు, ఇష్టం వచ్చినట్లుగా బలవంతంగా లాక్కుంటున్నారు.
– ఎన్నికలు వచ్చే సరికే ఓట్ల కోసం మూడు నెలల ముందు చంద్రబాబు నాయుడు రకరకాల సినిమాలు, డ్రామాలు ఆడుతున్నారు.
– రుణాలు, సబ్సిడీలు, గిట్టుబాటు ధరలు రాక కౌలు రైతులు నానా కష్టాలు పడుతున్నారు.
– పిల్లలను స్కూల్కు పంపాలంటే తల్లిదండ్రులు బాధలు పడుతున్నారు.
– ఒక పథకం ప్రకారం ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను మూసేస్తున్నారు.
– ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సరుకుల బిల్లులు నెలల తరబడి పెండింగులో పెడుతున్నారు.
–పేద విద్యార్థులు ఉన్నత విద్య చదవలేకపోతున్నారు. 108 సర్వీసులు పని చేయడం లేదు.
– ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.
– గ్రామాలలో జన్మభూమి కమిటీలు మాఫియాలా మారాయి. ప్రతి పనికి లంచం తీసుకుంటున్నాయి.
– ఎన్నికలు వచ్చేసరికి ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు చేయని డ్రామాలు ఉండవు. చెప్పని అబద్ధం ఉండదు. చేయని మోసం ఉండదు.













