ప్రాజెక్టులపై చిత్తూరు జిల్లా కలికిరి బహిరంగ సభలో జగన్ కామెంట్స్
– పులివెందులకు నీరు తెచ్చింది నీవా?
పులివెందులకు నీళ్లు తెచ్చానని చంద్రబాబు ఫోజు కొడుతున్నారు. ఆయన గట్ల మీద పడుకున్నారట. పైడిపాలెం ప్రాజెక్టు విలువ రూ.700 కోట్లు.. చంద్రబాబు దానికి పెట్టింది కేవలం రూ.23 కోట్లు మాత్రమే. మిగతాదంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పెట్టారు. నాలుగేళ్లలో రూ. 23 కోట్లు ఖర్చు చేసి ఆ క్రెడిట్ అంతా తాను తీసుకుంటున్నారు.
చిత్రావతి ప్రాజెక్టుకు వైఎస్ఆర్ రూ.290 కోట్లు ఖర్చు చేసి యుద్ధప్రాతిపాదికన పనులు చేపట్టారు. గండికోట నుంచి నీళ్లు ఇచ్చేందుకు దాదాపు రూ.1100 కోట్లు ఖర్చు చేశారు. ఇదే చంద్రబాబు రూ.72 కోట్లు ఖర్చు చేసి ఇవాళ పులివెందులలో ఫోజు కొడుతున్నారు. ఒక మనిషి మోసం చేయడానికి హద్దుపొద్దు ఉండాలి. ప్రాజెక్టులు కట్టిన వాడు గొప్పొడా? గేట్లు ఎత్తిన లష్కర్ గొప్పోడా?
– పీలేరు నియోజకవర్గంలోని అడవిపల్లె ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 70 శాతం పూర్తి చేశారు. హంద్రీనీవా నీళ్లు తెచ్చి అనంతపురం, చిత్తూరు జి ల్లాలను సస్యశ్యామలం చేయాలని భావించారు. అనంతపురం వరకు కాల్వ తవ్వించారు. నాలుగేళ్లుగా చంద్రబాబు అదిగో నీళ్లు అంటూ మభ్యపెడుతున్నారు. మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేసేందుకు చంద్రబాబుకు మనసు ఉందా ? చంద్రబాబుకు ప్రాజెక్టులు, రైతులపై ఎటువంటి ప్రేమ లేదు.













