ప్రతిపక్ష హోదా కోసం తన ఇమేజ్ను ఫణంగా పెడుతున్న జగన్..
ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమయ్యారు. అయినప్పటికీ ప్రతిపక్ష హోదా కోసం పట్టువదలని విక్రమార్కుడిన పోరాటం చేస్తూనే ఉన్నారు. 11 సీట్లతో ఆయనకు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చివరికి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి న్యాయస్థానంలో కూడా జగన్ పోరాటానికి సిద్ధపడుతున్నాడు. హైకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ లో 1953 ఏపీ యాక్ట్ గురించి ప్రస్తావిస్తూ.. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వవలసిందిగా జగన్ కోరుకుంటున్నారు. అయితే తుది నిర్ణయం స్పీకర్ చేతిలోనే ఉంటుంది అన్న విషయాన్ని జగన్ మర్చిపోతున్నారు. జగన్ కోర్టు తలుపు తట్టారు అంతవరకు బాగానే ఉంది.. ఇదే పాయింట్ హైకోర్టు కూడా స్పీకర్ కార్యదర్శి కి ,అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు ఇష్యూ చేసింది.
అయితే కోర్టులో కొంతవరకు మాత్రమే అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలలో జోక్యం చేసుకుంటాయి. జగన్ లేవనెత్తిన పాయింట్ లో కంటెంట్ ఉంటే కోర్టు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయాన్ని లేదా సెక్రటరీని వివరణ అడుగుతుంది. స్పీకర్ తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని జవాబు వస్తే మళ్లీ జగన్ ప్రతిపక్షం బంతి స్పీకర్ కోర్టులోకి వెళ్తుంది. అదే జరిగితే జగన్ కి ప్రతిపక్ష హోదా రావడం అనేది కచ్చితంగా కుదరదు.
అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా.. వారితో కలిసి అధికార పార్టీ మీద పోరాటం చేస్తే జగన్ కి ఉన్న డేరింగ్ డాషింగ్ ఇమేజ్ పెరిగే అవకాశం ఉండేది. అలాకాకుండా అసెంబ్లీకి దూరంగా ఉండడం.. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం ఒకరకంగా జగన్ పై నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మరోపక్క షర్మిల జగన్ పిరికివాడు అంటూ షర్మిల చేస్తున్న ఘాటు విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటు టిడిపి కూడా మొహం చూపించలేక అసెంబ్లీకి దూరంగా ఉంటున్నాడు అని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా లేకుండా మొదటి నుంచి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్తూ ఉంటే ఏ గొడవ వచ్చేది కాదు అనేవాళ్ళు ఉన్నారు. మరి జగన్ మోహన్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి..













