మూడు రాజధానులపై సీఎం మరోసారి క్లారిటీ
రాజధాని తరలింపుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానుల ఫార్మూలాతో ముందుకెళ్తామని సంకేతాలిచ్చారు. ఏలూరులో ఆర్యోగశ్రీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొందరికే న్యాయం జరిగిందంటూ గత ప్రభుత్వ నిర్ణయాలపై సీఎం రాజకీయ విమర్శలు చేశారు. నాటి నిర్ణయాలను సరిదిద్దుతామన్నారు. అన్ని ప్రాంతాలకు నీళ్లు, నిధులు, పరిపాలన అందాలన్నదే తమ ప్రభుత్వ విధానమని జగన్ సృష్టం చేశారు. తమ దృష్టిలో మూడు ప్రాంతాలూ సమానమేనంటూ రాజధానిపై పరోక్షంగా జగన్ క్లారిటీ ఇచ్చారు. గత నిర్ణయాల్ని సరిదిద్దుతామనడంలో అర్థమేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాజధాని మారుతోందని జగన్ చెప్పినట్టేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.













