ప్రముఖ పుణ్యక్షేత్రంలో వైసీపీ ఎన్నికల ప్రచారమా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారక తిరుమల చిన్న వెంకన్న దేవస్థానం వైసీపీ నేతలకు అడ్డాగా నిలిచింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యుడు వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. ట్రస్ట్‌బోర్డు సభ్యుడు యానాదయ్య దేవస్థానం కేశఖండనశాలలో క్షురకులను కలిసి వైసీపీకి ఓటు వేసి జగన్‌ను గెలిపించాలని కోరారు. వైసీపీ సిద్ధం పేరుతో ఉన్న కరపత్రాలను వారికి పంపిణీ చేశారు. ఆలయంలో ఎన్నికల ప్రచారం చేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆలయ ఈవో స్పందించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.













