Yarlagadda : జగన్‌కు అలాంటివారే నచ్చుతారు : యార్లగడ్డ
గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని తెలుగుదేశం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkat Rao) అన్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యార్లగడ్డ మాట్లాడారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకుంటారా. ఏనాడైనా పాపం పండుతుంది. గ్రీవెన్స్‌లో వచ్చే సమస్యల్లో అధిక శాతం భూకబ్జాలే. సభ్య సమాజం తలదించుకునేలా వల్లభనేని వంశీ మాట్లాడారు. జగన్ (Jagan)కు అలాంటివారే నచ్చుతారు. వంశీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు వారించలేదు? ఇకనైనా జగన్ తన వైఖరి మార్చుకోవాలి. వైసీపీ (YCP) నేతలు గన్నవరంలో భూములు కబ్జా చేశారు. ఎవరైనా చట్టానికి అనుగుణంగా నడుచుకోవాలి అని అన్నారు.













