వచ్చే ఎన్నికల్లో గన్నవరం టికెట్ నాదే
వచ్చే ఎన్నికల్లో గన్నవరం టికెట్ తనదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో గన్నవరం పరిధిలో ఇసుక దోపిడీ జరిగిందని, దానిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నాననే వార్తలు అవాస్తం అన్నారు. సీఎం జగన్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులను నేను వ్యక్తిగతంగా ఎప్పుడ తిట్టలేదన్నారు. ఈ నియోజకర్గంలోని ప్రతి సమస్య నాకు తెలుసు. వల్లభనేని వంశీ మా పాపార్టీలో ఉన్నప్పటికీ, జగన్ నాకే టికెట్ ఇస్తారని నమ్మకం ఉంది అని వెంకట్రావు పేర్కొన్నారు.













