ఆ ఘనత జగన్‌కే : యనమల
కేంద్రానికి ఇచ్చే వినతుల్లో గత ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రులు ప్రస్తావించిన సందర్భాలు చరిత్రలో లేవని ఆ ఘనత జగన్‌కే దక్కుతుందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై ఆయన ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ప్రధానికి సమర్పించిన వినతి పత్రాన్ని జగన్ మీడియాకు ఎందుకు విడుదల చేయలేదు. దానిపై ప్రధాని స్పందనేంటో ఎందుకు చెప్పలేదు. కేంద్రం నిధులిస్తేనే పోలవరంలో ఇటుక పెడతాను అనడంలో అంతర్యమేంటి. అమరావతిపై విచారణలకు, నిధులకు సంబంధమేంటి. ముఖ్యమంత్రి తన విచారణలు పూర్తయ్యేదాక నిధులు అడగరా. అప్పటిదాకా పనులు నిలిచిపోతే రాష్ట్రానికి నష్టం కాదా? ప్రత్యేక హోదాపై ప్రధాని నుంచి ఒక్కమాటైనా రాబట్టారా. మూడు సార్లు ఢిల్లీ పర్యటనల ద్వారా రాష్ట్రానికి ఆయనం ఏం సాధించారు. అంటూ యనమల ప్రశ్నించారు.













