ఇలాంటి వాళ్లు అడిగితే ఒక్క చాన్స్ ఇచ్తేస్తామా? : యనమల
ప్రపంచ చరిత్రలో నియంతలైన ముస్సోలిని, హిట్లర్, గడాఫీ వీళ్లంతా ఒక్కొక్కరూ ఒక్కో రకమైన అరాచకవాదులు. జగన్ వీళ్లందరి అవలక్షణాలు కలిగినవాడు. ఇలాంటి వాళ్లు అడిగితే ఒక్క చాన్స్ ఇచ్చేస్తామా? అని మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ తాత రాజారెడ్డి హయాం నుంచి వీళ్లకి ఫ్యాక్షన్ నేపథ్యం ఉందన్నారు. ఓ వ్యాపారిని చంపిన రాజారెడ్డి అరాచకాలు భరించలేకే అయన్ని కూడా చంపేశారని యనమల తెలిపారు. అలాంటి రాజారెడ్డి జీన్స్ జగన్‌కి వచ్చాయన్నారు. జగన్ తన అక్రమాస్తులను కాపాడుకునేందుకు, కేసుల నుంచి బయటపడేందుకే రాజకీయాల్లో ఉన్నారని విమర్శించారు. కేసీఆర్ నుంచి జగన్‌కు రూ.వెయ్యి కోట్లు అందాయని, మోదీ నుంచి కూడా మరో వెయ్యి కోట్లు అంది ఉంటుందని అన్నారు.













