సూత్రధారులను.. పాత్రధారులను పట్టుకుని తీరుతాం : చంద్రబాబు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దోషుల్ని పట్టుకుని తీరుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. వివేకా హత్యలో వాస్తవాలన్నీ బయటకు తెస్తామని చెప్పారు. వివేకా హత్య వెనుక అసలు దోషులను పట్టుకుంటామన్నారు. సూత్రధారులు, పాత్రధారుల ముసుగు తొలగిస్తామని తెలిపారు. కుట్రదారులకు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.
ఈ విషయంలో ఎవరెవరు దోషులు? ఎంతమంది దోషులు ఉన్నారు? అర్ధరాత్రి తెల్లవారుజామున ఏం జరిగింది? బెడ్ రూమ్, బాత్ రూమ్ రక్తపు మడుగులు కడిగిందెవరు? గుండెనొప్పి, వాంతులు నాటకం ఎందుకాడారు? పంచనామా కాకుండా ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు? బట్టలు ఎందుకు మార్చారు? మృతదేహాన్ని ఎందుకు బెడ్ రూమ్ చేర్చారు? అన్న విషయాలు బయటకొస్తాయన్నారు. ముందు గుండెనొప్పి అన్నారు, 9:30 తరువాత హత్య అన్నారు. వివేకాను చంపడం వల్ల ఎవరికి లాభం? వీటన్నింటిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. నీతిమాలిన, నేరమయ రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ, వైసీపీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.













