పవన్ ను ఎందుకు పట్టించుకోలేదు…?
తిరుపతి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం సమర్థవంతంగా చేయకపోవడంతో ఇప్పుడు బిజెపి పార్టీ ఎక్కువగా ఇబ్బంది పడుతుంది అనే భావన చాలా వరకు వ్యక్తమవుతోంది. భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ తో కలిసి ముందుకు వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుందనే భావన చాలా మందిలో ఉంది. పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా బిజెపికి సహకరిస్తున్న సరే బిజెపి నేతలు మాత్రం ఆయనను ప్రోత్సహించే విషయంలో ముందడుగు వేయలేకపోతున్నారు.
జనసేన పార్టీకి బలం ఎక్కువగా ఉన్నా కొన్ని ప్రాంతాల్లో ఆ బలాన్ని వాడుకోలేని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తానని సిద్ధమైనప్పుడు జనసేన పార్టీకి ఎన్నో కొన్ని స్థానాలు ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్లి ఉంటే ఇంకా మరి కొన్ని స్థానాలు వచ్చి ఉండేవి. తిరుపతి ఉప ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కచ్చితంగా జనసేన పార్టీకి సీటు ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.
కానీ బీజేపీ నేతలు మాత్రం ఈ విషయంలో తప్పులు ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రచారం విషయంలో పవన్ కళ్యాణ్ ని బీజేపీ నేతలు వాడుకోలేక పోతున్నారు. ముందు ప్రచారానికి ఆయన వెళ్లినా ఆ తర్వాత మాత్రం కొన్ని కొన్ని ఇబ్బందులను అంచనా వేసుకున్న పవన్ కళ్యాణ్ వెనక్కు తగ్గారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. పవన్ కళ్యాణ్ వద్ద కీలక అంశాలను ప్రస్తావించి.. పార్టీ పరిస్థితి గురించి నివేదిక ఇచ్చి బీజేపీ నేతలు ఆయనతో మాట్లాడి జాగ్రత్తగా వెళ్లి ఉంటే బాగుండేది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో కొన్ని అభిప్రాయాలను కూడా బీజేపీ నేతలు తెలుసుకోలేకపోయారు.
రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండటంతో పవన్ కళ్యాణ్ కూడా పెద్దగా తిరుపతి పార్లమెంట్లో ప్రచారం చేయడానికి ఆసక్తి చూపించలేదు అని కొంతమంది అంటున్నారు. ఇక బీజేపీ అగ్రనాయకత్వం మొండి వైఖరితో ముందుకు వెళ్ళడంతో పవన్ కళ్యాణ్ కూడా కరోనా పేరు చెప్పి వెనక్కు తగ్గారు అని అంటున్నారు. అధికార పార్టీ నేతలు తిరుపతి పార్లమెంటు పరిధిలో ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా తిరిగితే కనీసం బిజెపికి గౌరవప్రదమైన ఓట్లయినా వచ్చే అవకాశం ఉంటుంది. గెలిచే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి కనీసం గౌరవప్రదంగా బయటపడిన బాగానే ఉంటుంది. కానీ దీనిని కూడా బీజేపీ నేతలు పట్టించుకోలేదు.













