Nara Lokesh: వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆనాడే చెప్పాను : మంత్రి లోకేశ్
ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) జైలుకెళ్లారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్న ఆయన, చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తప్పు చేసిన వైసీపీ నేతలు(YCP leaders), అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని యువగళం (uvagalam)లో రెడ్ బుక్ (Red Book ) చూపించి చెప్పామన్నారు. తెలుగుదేశం నాయకుల్ని గత ఐదేళ్లలో చట్టాలు ఉల్లంఘించి ఇబ్బంది పెట్టిన వారిపట్ల రెడ్ బుక్ అమలవుతుందని తెలిపారు.
2019-24 మధ్య సాగిన అచారకపాలన ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతుంటే అడుగడుగునా ఇబ్బందులు పెట్టి, చంద్రబాబు బయటకు రాకుండా ఇంటి గేటుకు తాళ్లు కూడా కట్టారని గుర్తు చేశారు. ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వ అక్రమాలను నిలదీస్తే, అక్రమ కేసులు పెట్టడం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని తెలిపారు.













