అమరావతికి మద్దతుగా వాషింగ్టన్ లో కొవ్వొత్తుల ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళన 800 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి మద్దతుగా అమెరికాలోని వాషింగ్టన్ డీ.సీ.లోని ప్రవాసాంధ్రులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మన్నవ మాట్లాడుతూ మూడు రాజధానుల వల్ల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. దేశ చరిత్రలో అమరావతి ఉద్యమం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ నాదేళ్ల, డాక్టర్ నాగదేవినేని, శ్రీరామినేని వినీల్, బోయపాటి సిద్దార్థ, డాక్టర్ లిఖిత్ ఎల్లా, మూగులూరి భాను తదితరులు పాల్గొన్నారు.













