ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం

ఆంధప్రదేశ్‍లోని విశాఖపట్నం పర్యటనకు విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు విశాఖ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉపరాష్ట్రపతి విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు ప్రజా ప్రతినిధులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతికి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నౌకాదళ అధికారి వైస్ అడ్మిరల్ ఏ.బి.సింగ్, విశాఖ మేయర్ జి.వి.హరికుమారి, విశాఖ పోర్టు చైర్మన్ కె.రామ్మోహన్ రావు, జిల్లా కలెక్టర్ వి. వినరు చంద్, పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, ఎమ్‍ఎల్సీ పి.వి.మాధవ్ తదితరులు స్వాగతం పలికారు. తరువాత ఉపరాష్ట్రపతి నేరుగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ గెస్ట్హౌస్‍కి వెళ్లారు. అనంతరం విశాఖపట్నం పోర్టు అతిథి గృహం వద్ద భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయడు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ నెల 29వ తేదీ వరకు విశాఖపట్నంలో ఉపరాష్ట్రపతి ఉండనున్నారు.