తమిళనాడు గవర్నర్ కు విశాఖ శారదాపీఠం ఆహ్వానం
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి తమిళనాడు గవర్నరు రవీంద్ర నారాయణరవిను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. చెన్నైలోని రాజ్ భవన్లోకు వెళ్లిన స్వాత్మానందేంద్ర విశాఖ శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను గవర్నర్కు అందజేసారు. జవనరి 27 నుంచి 31 వరకు విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయని స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే రాజాశ్యామాల యాగంలో పాల్గొని అమ్మవారి అనుగ్రమం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆశీస్సులు పొందాలని గవర్నరును ఉత్తరాధికారి కోరారు.













