జగన్ సర్కార్ కు ఉపరాష్ట్రపతి ప్రశంస
కరోనా వైరస్ నియంత్రణకు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వాగతించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగంగా నిర్వహించేందుకు దక్షిణ కొరియా నుండి లక్షల రాపిడ్ టెస్టు కిట్లను రాష్ట్ర ప్రభుత్వం దిగుమతి చేసుకోవడం ముదావహమాన్నరు. వీటిద్వారా 10 నిమిషాల్లోనే ఫలితాలు రావడం, రోజుకు 10 వేల మందికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండటం మంచి పరిణామన్నారు. ఈ పరికరాల ద్వారా కరోనా కేసుల్లో ప్రాథమిక పరీక్షలను వీలైనంత త్వరగా గుర్తించడం ద్వారా మరింత పకడ్బందీగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలను చేపట్టేందుకు వీలవుతుందన్నారు.













