ఉచిత విద్యుత్ పై బాబు విమర్శలు అర్ధరహితం
గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ పై చులకనగా మాట్లాడిన చంద్రబాబు తమ ప్రభుత్వంపై మాట్లాడడం సిగ్గు చేటన్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పధకంపై విమర్శలు చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఆయన ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్ సాధ్యం కాదని, ఉచితంగా కరెంట్ ఇస్తే విద్యుత్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. చంద్రబాబు తన పాలనలో విద్యుత్ కనెక్షన్లను క్రమబద్ధీకరించలేదన్నారు. తమబోటి వారు మాట్లాడితే ఏదో కుర్రాడు పిచ్చోడు అంటారని, నలభై రెండేళ్ల అనుభవం ఉందంటున్న చంద్రబాబు అర్ధం పర్ధం లేకుండా మాట్లాడితే పిచ్చెక్కిందంటారన్నారు.
చంద్రబాబుకు రేపు తన పరిస్థితి ఏమిటో అర్ధం కాక భయం పట్టుకుందన్నారు. కొడుకు చూస్తే అది లేవలేని బంది అని ఎద్దేవా చేశారు. దీంతో ఎంతో రాజకీయ అనుభవం ఉండి కూడా ఇలా చిల్లరగా మాట్లాడుతుంటే పరిస్థితుల కారణంగా నిజంగానే పిచ్చి పట్టిందేమో అని జనం అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తమచంద్రబాబుఇప్పుడు రైతులకు నిధుల బదిలీ పథకంతో ఉచిత విద్యుత్ కు ఉరివేసినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రైతులు మరో 30 ఏళ్ల పాటు ఇబ్బందులు పడకూడదనే కేంద్ర సంస్కరణలను సీఎం జగన్ అందిపుచ్చుకున్నారని, జీతాలు, పెన్షన్ల మాదిరే ఉచిత విద్యుత్ డబ్బులు కూడా ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. అయితే ఈ పధకం ఇంకా పైలట్ ప్రాజెక్టు దశలోనే ఉందని, ముందుగా శ్రీకాకులం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేశాక…అప్పుడు దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారన్నారు.













