వీఐటీని సందర్శించిన అమెరికా కాన్సుటేట్ బృందం
అమరావతిలోని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ బృందం సందర్శించింది. అమెరికన్ కాన్సులేట్ వైస్ కైన్సిల్ చార్లెస్ స్పెక్ట్, సాంస్కృతిక వ్యవహారాల సహాయకుడు సెంథిల్, యూఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రాంతీయ అధికారి మోకానికా సేటియా వీఐటీని సందర్శించారు. ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి పర్డ్యూ విశ్వవిద్యాలయం, న్యూయార్క్ స్టేట్ వర్సిటీ, రోచెస్టర్ వర్సిటీ, విశ్వవిద్యాలయం ఆఫ్ మసాచుసెట్స్, బిజినెస్ ఆడ్మినిస్ట్రేషన్ కోర్సుకు సంబంధించి మిచిగాన్- డీర్ బోర్న్ వర్సిటీతోపాటు పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు వీఐటీ-ఏపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ శేఖర్ విశ్వనాథన్ వివరించారు. అంతర్జాతీయ బదిలీ కార్యక్రమం బీటెక్ రెండేళ్లు స్థానికంగా అమెరికాలో మరో రెండేళ్లు చదివేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాలో విద్యనభ్యసించేందుకు అవసరమైన ఉపకారవేతనాలపై అవగాహన కల్పించేందుకు వీఐటీ-ఏపీతో కలిసి పని చేయనున్నట్లు సెంథిల్ వెల్లడించారు.













