ఏపీని కేంద్రం ఆదుకుంటోంది
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీని శక్తిమంతమైన పార్టీగా తయారు చేయాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విజయవాడ సిద్దార్థ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల మహా సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మోదీ అంటే సుపరిపాలనకు మారుపేరని, మరో పదేళ్లపాటు బీజేపీ దేశ వ్యాప్తంగా అధికార ఢంకా మోగించాలని, దేశం మొత్తం బీజేపీ, మోడీపైనే చూస్తోందన్నారు. గడచిన మూడేళ్లలో ఒక్క అవినీతి కుంభకోణం లేదని, ఇతర పార్టీలు చీలిక పేలికలుగా తయారయ్యాయని, అవినీతి పరుల పాలిట మోడీ అతివీర భయంకరునిగా తయ్యారయ్యారని అన్నారు. మోడీ వంటి సామాన్యుడు ప్రధాని పదవి చేపట్టారంటే అది భారతీయ జనతాపార్టీ ఘనతేనన్నారు. రేపటి నుంచి జూన్ 15 వరకు మోడీ ఫెస్ట్‌తో పేరుతో ఉత్సవాలు జరగబోతున్నాయి. పార్టీ శ్రేణులంతా పాల్గొని బీజేపీని ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం ఆదుకుంటోందన్నారు. కొందరు వ్యక్తులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు.













