Rammohan Naidu :ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం : రామ్మోహన్ నాయుడు
విశాఖ ఉక్కు పరిరక్షణకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తెలిపారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయాన్ని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి(Kumaraswamy), మరో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ(Srinivasa Varma)తో కలిసి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్యాకేజీ ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi ) కి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా నెలకొన్న స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి అడుగులు పడ్డాయని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదాన్ని కేంద్రం కాపాడిరదన్నారు.
సీఎం చంద్రబాబు ప్రధానమంత్రిని కలిసినప్పుడల్లా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశమే ప్రధాన ఎజెండాగా చర్చించారని గుర్తు చేశారు. ప్యాకేజీ రావడానికి కృషి చేసిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే కుమారస్వామి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించి, కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారని గుర్తు చేశారు.













