TTD: టీటీడీ బోర్డు సభ్యునిగా టీవీఎస్ మోటార్స్ సీఎండీ సుదర్శన్ వేణు

టీవీఎస్ మోటార్స్ సీఎండీ సుదర్శన్ వేణు (Sudarshan Venu) ను తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) బోర్డు సభ్యునిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 29 మంది సభ్యులతో టీటీడీ బోర్డు (TTD Board) ను ప్రభుత్వం గత ఏడాది నవంబరులో నియమించింది. అందులో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు (Justice HL Dattu) ను సభ్యునిగా నియమించగా ఆయన బాధ్యతలు చేపట్టలేదు. దీంతో ఆయన స్థానంలో సభ్యుడిగా సుదర్శన్ వేణును నియమించింది. ఈయనకు గతంలోనూ టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది.