TTD Board: కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ… తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు!
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో భక్తులకు దర్శనం, వసతి కల్పించే విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న డిమాండ్‌కు టీటీడీ బోర్డు (TTD Board) ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. వారంలో రెండుసార్లు తెలంగాణ ప్రజాప్రతినిధుల (Telangana People s Representatives) సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై భక్తులు హర్షం వ్యకతం చేశారు. గత కొన్నేళ్లుగా తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోకపోవడంపై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గళం విప్పిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)తో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు సానుకూల నిర్ణయం తీసుకుంది.













