తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు దర్శనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామివారికి జరిగే నిజపాదసేవలో స్వామివారిని దర్శించికొని, మొక్కులను ఆమె చెల్లించుకున్నారు. కాలినడకన తిరుమలకు చేరుకున్న కవిత దంపతులకు అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు, స్వామి వారి పట్టు వస్త్రాలను అందజేశారు. అనంతరం తిరుచానూరు పద్మావతీ అమ్మవారి దేవాలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.













