వైఎస్ జగన్ బెయిల్ రద్దుపై హైకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్ వేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని గతంలో రఘురామ దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించడంతో రఘురామ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ వాదనలు విన్ని న్యాయస్థానం పిటిషన్పై విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.













