రెండో రోజుకు ఎంపీ సీఎం రమేష్ దీక్ష
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజూ కొనసాగుతోంది. మొదటి రోజు భారీ సంఖ్యలో ప్రజలు, వివిధ వర్గాలు, రాజకీయ పార్టీలు వీరి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. నేడు కూడా వివిధ విద్యార్థి సంఘాలు, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, తెలంగాణ నుంచి వచ్చిన కొందరు ప్రజాసంఘాల నాయకులు సీఎం రమేష్‌కు మద్దతు తెలిపారు. ఉక్కు దీక్షలు 350 రోజులకు చేరుకున్న సందర్భంగా ఆర్సీపీ కార్యకర్తలు సీఎం రమేశ్ చేపట్టిన దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. రేపటి నుంచి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దీక్షాస్థలికి చేరుకుని మద్దతు తెలుపుతారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అధికార పార్టీ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి తెలిపారు.













