కేటీఆర్ ఏపీ వస్తే ఏం చూపిస్తారు ?
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు వస్తే వైసీపీ నేతలు ఏం చూపిస్తారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ ప్రశ్నించారు. మూసేసిన అన్న క్యాంటీన్లు, పడకేసిన పోలవరం చూపిస్తారా? ఆస్పత్రుల్లో సెల్‌ఫోన్ లైట్ల వెలుతురులో వైద్యం చూపిస్తారా? అని ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో పిచ్చి మొక్కల్ని చూపిస్తారా? రాజధాని పేరుతో విశాఖలో చేసిన భూకబ్జాలు చూపిస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి చూపాలని డిమాండ్ చేశారు. తెచ్చిన అప్పులుకు ప్రభుత్వం లెక్కలు చెప్పాలని కోరారు.













