గంటా వ్యూహం…టిడిపికి గెలుపు
విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయాలకు దూరంగా ఉంటూ సడెన్గా తెరమీదికి వచ్చారు. ఆయన రావడంతోనే టిడిపిని గెలిపించారని చెబుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహానికి గంటా శ్రీనివాసరావు వ్యూహం తోడవడంతో కీలకమైన ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలోనూ..ఇటు ఎమ్మెల్యే కోటాలోనూ టీడీపీ విజయాన్ని సాధించిందని చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావుకు రాజకీయ వ్యూహకర్తగా మంచి పేరుంది. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. ఇప్పటి వరకు గెలవడమే తప్ప.. ఓడింది లేదు. అంతేకాదు.. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేసినా.. ఏ స్థానం నుంచి పోటీ చేసినా(అది ఎంపీ ఎమ్మెల్యే) ఆయన గెలుపు తథ్యం. ఆయనకు ఇప్పటి వరకు తిరుగులేదనే టాక్ ఉంది.
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చివరి నిముషంలో వేపాడ చిరంజీవి రావును గంటా తెరముందుకు తీసుకువచ్చారు. ఆయనే స్వయంగా నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. అదేవిధంగా ప్రచారం కూడా చేశారు. చక్కని వ్యూహంతో చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చానని గంటా ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ.. పంచుమర్తి అనురాధను ఎంపిక చేసింది చంద్రబాబు అయినప్పటికీ.. ఆమె నామినేషన్ పత్రాలపై సంతకం చేసింది మొదలు ఉత్తరాంధ్ర సహా ఇతర ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలను సమన్వయం చేసింది గంటానే అని టీడీపీ నాయకులు చెబుతున్నారు.













