చేతగాని వాడికి పగ్గాలు అప్పగిస్తే… పాలన ఇలానే
పాలించడం చేతగాని వాడికి పగ్గాలు అప్పగిస్తే పాలన ఇలానే ఉంటుందని తెలుగుదేశం పార్టీ నేత ఆలపాటి రాజేందప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రెడ్డి రెండేళ్ల పాలన మూడు కేసులు, ఆరు అరెస్టులుగా ఉందని అన్నారు. సమస్యలను ప్రశ్నించిన ప్రతిసారి పార్టీ నాయకులపై అక్రమ అరెస్టులు, కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. దూళ్లిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నామన్నారు. ఒక బందిపోటును అరెస్ట్ చేసినట్లుగా వందల మంది పోలీసులతో నరేంద్రను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని అన్నారు. ముఖ్యమత్రి 11 కేసుల్లో ఏ1 ముద్దాయి, 16 నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులను జైల్లో పెట్టడమే జగన్ రెడ్డి ధ్యేయమా? అని ప్రశ్నించారు. వేధించి కోడెల శివప్రసాద్‌ను బలిగొన్నారని అన్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా, దూళ్లిపాళ్ల నరేంద్రలపై కుట్ర పూరితంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.













