19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలి : టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు నియోజకవర్గాల పరిధిలో 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని గతంలోనే ఈసీని కోరినట్టు టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడుకుని. సీఎస్‌కు వైసీపీ ఫిర్యాదు చేసినట్టు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. దశలవారీగా రీపోలింగ్ జరిపిన సందర్భాలు లేవని, మా విజ్ఞప్తిని కూడా సీఈసీకి పంపాలని సీఎస్‌ను కోరినట్టు తెలిపారు. కౌంటింగ్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి తమ విజ్ఞప్తిని కూడా పరిశీలించాలని డిమాండ్ చేశారు.













