Subramanya Swamy: ఏపీపై సుబ్రమణ్య స్వామికి ఉన్న స్పెషల్ ఇంట్రస్ట్ ఏంటి..?
సుబ్రమణ్య స్వామి (Subramanya Swamy) పేరు సుపరిచితం. సీనియర్ రాజకీయ నాయకుడిగా సుప్రసిద్ధులు. జనతాపార్టీని (Janatha Party) బీజేపీలో (BJP) విలీనం చేయడం ద్వారా ఆయన కమలం పార్టీ నాయకుడయ్యారు. ఆ పార్టీ తరపున పలుమార్లు రాజ్యసభకు (Rajyasabha) ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటికీ ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా పలు అంశాలపై స్పందిస్తూ ఉండడం, తనకు నచ్చని వాటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేయడం సుబ్రమణ్యస్వామికి తెలిసిన విద్య. ఇలాంటి పిటిషన్ల ద్వారా రాజకీయ నేతలను బెదిరించి దారికి తెచ్చుకుంటూ ఉంటారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. తాజాగా ఏపీపై (AP) ఆయన స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలో ఉన్నప్పుడు సుబ్రమణ్య స్వామి ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే పేరుంది. నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి (TDP) వ్యతిరేకంగా ఆయన న్యాయస్థానాల్లో పలు పిటిషన్లు వేశారు. ముఖ్యంగా పింక్ డైమండ్ (pink diamond) విషయంలో ఆయన న్యాయస్థానాన్ని (courts) ఆశ్రయించారు. ఇక టీటీడీ (TTD) ఓ మీడియా సంస్థపై దాఖలు చేసిన కేసులో ఆయన టీటీడీ తరపున న్యాయవాదిగా వ్యవహరించారు. టీటీడీపై ప్రభుత్వం పెత్తనం ఉండకూడదని, స్వతంత్ర సంస్థగా దాన్ని ఉంచాలని ఆయన పోరాడుతున్నారు. తాజాగా తిరుమల (tirumala) కల్తీ నెయ్యి (adulterated ghee) వ్యవహారంపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. దీనిపై వాస్తవాలు నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టులో (supreme court) పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా తిరుపతి (Tirupati) మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక (Deputy Mayor Election) సందర్భంగా గొడవలు జరిగాయి. ఈ స్థానాన్ని వైసీపీ నుంచి టీడీపీ (TDP) కైవసం చేసుకుంది. అయితే వైసీపీ కార్పొరేటర్లను (YCP Corporators) బెదిరించి వాళ్లపై దౌర్జన్యం చేసి టీడీపీ కైవసం చేసుకుందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఈ అంశంపై హైకోర్టులో (High Court) సుబ్రమణ్య స్వామి పిటిషన్ (petition) దాఖలు చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలనేది ఈయన డిమాండ్. అంతేకాక.. ఇకపై ఏపీకి తరచుగా వస్తుంటానని, పిటిషన్లు కూడా వేస్తుంటానని ఈ సందర్భంగా సుబ్రమణ్య స్వామి వెల్లడించారు. దీంతో ఈయనకు ఏపీపై అంత స్పెషల్ ఇంట్రస్ట్ ఏంటని ఆరా తీస్తున్నారు.
అయితే సుబ్రమణ్య స్వామి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొత్తు అని.. ఆయన కూడా ఆ పార్టీ పేటీఎం అని కొందరు విమర్శిస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడే ఆయన వైఖరి ఏంటో అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు. పింక్ డైమండ్ పై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన స్వామి.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి.. ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు సుబ్రమణ్య స్వామిని అడ్డు పెట్టుకుని వైసీపీ ఆడుతున్న డ్రామాగా దీన్ని అభివర్ణిస్తున్నారు. బీజేపీ నేతగా ఉంటూ ఏపీలో ఆ పార్టీ అధికారంలో ఉన్న కూటమిపై పోరాడుతుండడాన్ని బట్టి ఆయనకు పార్టీపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు. వాస్తవానికి సుబ్రమణ్య స్వామిపై ఇలాంటి ఆరోపణలు కొత్తకాదు. గతంలో కూడా ఆయన పలు పార్టీలకు అనుకూలంగా, మరికొన్ని పార్టీలకు వ్యతిరేకంగా ఇలా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.













