ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు అమరావతి అసెంబ్లీలో శాసన మండలి ఇన్చార్జి కార్యదర్శి సత్యనారాయణరావును కలిసిన తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ రాజీనామాను ఆమోదిస్తూ మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నందున ఎమ్మెల్సీగా కొనసాగకూడదనే వ్యక్తిగత నిర్ణయంతోనే రాజీనామా చేశానన్నారు. సర్వేపల్లి నుంచి తన పోటీపై తుది నిర్ణయం పార్టీదేనన్నారు. మంత్రి పదవిలో కొనాసాగనున్నట్లు తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినప్పుడే ప్రజల్లో బీజేపీ విశ్వసనీయత కోల్పోయిందన్నారు.













