సోషల్ మీడియా వేదికగా టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం..
ఏపీలో రేపు సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో నిన్నటితో ప్రచారాలకు తెరపడింది. ప్రచారం ముగిసినప్పటికీ సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇప్పటికే ఆంధ్ర ఎన్నికల్లో చాలా సెన్సిటివ్ గా మారిన ముస్లిం రిజర్వేషన్ పై చంద్రబాబు మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైసీపీ.. బీజేపీ ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చంద్రబాబు కూడా చెప్పకనే చెప్పారు అంటూ పేర్కొంది. అయితే ఈ వీడియో పై స్పందించిన చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతా నుంచి నిజమైన పూర్తి వీడియోను విడుదల చేశారు. ఇలా కేవలం ఒక చిన్న వీడియో పెట్టి వైరల్ చేసి ప్రజలలో లేనిపోని భయాందోళన కలిగిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తాను అన్నది ఒకటైతే.. ప్రచారం చేస్తోంది మరొకటి అని.. నిజానికి రిజర్వేషన్లు మాత్రమే అభివృద్ధికి సరిపోవని.. వాటితో పాటుగా మరింత చేయూతనివ్వాలి అన్న ఉద్దేశంతో తాను మాట్లాడితే.. ఆ వీడియోని వేరొక విధంగా చూపిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో మాటల యుద్ధం మొదలైంది. కొందరు చంద్రబాబును సమర్థిస్తుంటే.. మరికొందరు జగన్ వైపు మాట్లాడుతున్నారు.













