AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం

ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) మద్యం కుంభకోణంలో ఎవరు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ (YC) ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ప్రముఖ వ్యక్తులపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఫోకస్ పెట్టి గత 20 రోజుల నుంచి వారిని టార్గెట్ చేస్తూ వస్తోంది. వారు కుంభకోణంలో అత్యంత కీలకంగా వ్యవహరించినట్లు పక్క ఆధారాలతో దర్యాప్తు బృందం అడుగులు వేస్తోంది. న్యాయపరమైన చిక్కులు కూడా రాకుండా దర్యాప్తు అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ఇక తాజాగా ఈ వ్యవహారంలో సంచలనం నమోదయింది. మద్యం కుంభకోణంలో కీలక నిందితులుగా భావిస్తున్న వైయస్ జగన్(Ys jagan) మాజీ ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డిని అలాగే ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికి సంబంధించి పక్క ఆధారాలు ఉండటంతో దాదాపు 15 రోజుల నుంచి దర్యాప్తు అధికారులు వీరిని విచారించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వీళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఫలితం లేకుండా పోయింది.
ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు వీళ్లిద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయగా.. సాయంత్రం వరకు ఎదురుచూసిన అధికారులు, సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసే ముందు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈవారం ప్రారంభంలో సుప్రీంకోర్టు గడప తొక్కిన ఈ ఇద్దరు తమను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. దానిపై విచారణ జరిపిన కోర్టు అరెస్టు చేయకుండా సిట్ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చింది. శుక్రవారం వరకు అదుపులోకి తీసుకోవద్దని వీళ్ళిద్దరూ ఈలోపు విచారణకు సహకరించాలని పేర్కొంది. మూడు రోజుల నుంచి విచారిస్తున్న అధికారులు అందరూ ఊహించినట్లుగానే శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.