దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో : సజ్జల
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సామాజిక న్యాయం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఇన్ని అవకాశాలు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ సామాజిక సాధికారతను చేతల్లో చూపుతున్నారు. మూడున్నరేళ్లలో సీఎం జగన్ సామాజిక విప్లవం తీసుకొచ్చారు అని అన్నారు.













