వైసీపీ ని వీడుతున్న ఎస్సీ నేతలు.. ఇది పార్టీకి మంచిదేనా?
రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటిస్తున్న వైసీపీ సెట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త వాళ్లను దించుతోంది. దీంతో టికెట్టు దక్కని నాయకులు ఇతర పార్టీలలో చేరడానికి సిద్ధపడుతున్నారు. ఇలా బయటకు వెళ్తున్న వారిలో ఎక్కువగా ఎస్సీ నాయకులు ఉండడం గమనార్హం. లేటెస్ట్ గా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే వరప్రసాద్ వైసీపీ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో వరప్రసాద్ బీజేపీ లో చేరారు. తిరుపతి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం వరప్రసాద్ కు దక్కింది అని టాక్. మరో ఎస్సీ నాయకుడు చింతలపూడి.. షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈయనకు కాంగ్రెస్ తరపున చింతలపూడి టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆలోచించవలసిన ముఖ్యం విషయం ఏమిటంటే.. మొదటినుంచి బడుగు బలహీన వర్గాలకు సపోర్టుగా ఉన్న పార్టీ మాది అంటూ చెబుతూ వస్తున్నారు జగన్. ఎన్నిక లు దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఇలా వరుసగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. దీని ప్రభావం రేపు ఎన్నికలలో ఎస్సి ఓటు బ్యాంకు పై ఖచ్చితంగా పడుతుంది. ఆయా నియోజకవర్గాలలో మాత్రమే వైసీపీ ఓటు బ్యాంకు చీలుతుందా లేక మొత్తానికే తేడా పలుకుతుందా చూడాలి.













