135 సీట్లకు పై మాటే తప్ప ఒక్క సీటు తగ్గే అవకాశం లేదు!
సీఎంకు నిఘా వర్గాల నివేదిక? ఏపీలో సంక్షేమ పథకాలు గ్రామాలకు గ్రామాలనే మార్చి వేస్తున్నాయి. రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ఏకపక్షం చేసేసాయి. మళ్లీ సీఎం చంద్రబాబుకే మా ఓటు అని తీర్మానించుకునేలా చేశాయి. ఆంధ్రాపై తెలంగాణ నాయకుల మాటల దాడులు, బీజేపీ కోవర్టు ఆపరేషన్లు ఏపీ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీసాయి. ప్రతిపక్ష వైకాపా రాష్ట్రంపై దండయాత్రకు పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీ వ్యతిరేకులను రాష్ట్రంలోకి దింపుతోందని ప్రజలు భావిస్తున్నారు. సంక్షేమం, సెంటిమెంట్, అభివృద్ధి ఈ మూడు టీడీపీకి ఓట్ల సునామీని సృష్టిస్తాయి అని నిఘా వర్గాల నుంచి చీఫ్ మినిస్టర్‌కి గ్రౌండ్ రిపోర్టు వెళ్లినట్టు తెలిసింది. ఏపీలో మహిళలు, వృద్ధులు ఏకపక్షంగా తెలుగుదేశం పక్షం వహించబోతున్నారని ప్రజల నాడి నివేదికలు చెబుతున్నాయి. పట్టణాల్లో టీడీపీకి ఏకపక్షంగా చాలా కాలం నుంచి ఉంది. కానీ గ్రామాల్లో రెండు నెలల వరకు గట్టి పోటీ వాతావరణం ఉండగా సంక్రాంతి తర్వాత గ్రామాల్లో ఒక్కసారి పెద్ద మార్పు చోటు చేసుకుందని నిఘా వర్గాలు నివేదించాయి. వారం వారంకు టీడీపీ గ్రాఫ్ పైపైకి దూసుకు పోతూండగా జగన్ గ్రాఫ్ పడిపోతోందని అంటున్నారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబును దింపి ఏవీ తెలియని జగన్‌ను సీఎం చేస్తే ఇంతకంటే బాగా చేయగలడా అంటే వైసీపీ మద్దతు దారులు కూడా దానికి బదులు ఇవ్వలేకపోతున్నారని రిపోర్టులో పేర్కొన్నట్టు తెలిసింది. వైసీపీ కంటే టీడీపీకి కనీసంలో కనీసం 8 శాతం నుంచి 16 శాతం అధికంగా ఓట్లు, 135 నుంచి 150 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.రాయలసీమ జిల్లాల్లో ప్రజల అభిప్రాయాన్ని టీడీపీకి అనుకూంగా మలచటంలో హంద్రీనీవా జలాలు, కృష్ణా జలాలు ఇవ్వటం ఒకటి రెండోది పరిశ్రమలు. ఈ రెండే కీలకంగా చెబుతున్నారు. ఆనంతపురంలో కియా వంటి ప్రపంచంలోనే టాప్ పరిశ్రమలతో కూడిన ఆటో మోబైల్ రంగం, తిరుపతిలో అనేక సెల్‌ఫోన్, టీవీలు తదితల వరల్డ్ క్లాస్ ఎలక్ట్రానిక్స్, విశాఖలో ఐటీ రంగం ఇలా రాష్ట్రంలో అన్ని చోట్లా అభివృద్ధి జరుగుతోంది. 24 వేల కిలోమీటర్లు రాష్ట్రంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశారు. పారిశ్రామికీకరణ ఒకేచోట కేంద్రీకరణ జరిగితే ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెంది మిగిలిన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉంటాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు కావాలి. అంటే వికేంద్రీకరణ జరగాలి. ముందస్తు ఆలోచనలతో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పరిశ్రమలను వికేంద్రీకరణ చేసే దిశగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు అని జనం చెబుతున్నట్టు నిఘా వర్గాల నివేదికలో పేర్కొన్నాయి.













