మంత్రి నారా లోకేష్‌ను కలిసిన ప్రముఖ గాయని శోభారాజు
అమరావతి: ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత కళాకారిణి, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనల ఆలాపన, ప్రచారంలో విశేష ప్రావీణ్యం సంపాదించిన పద్మశ్రీ శోభారాజు మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌కి శోభారాజు అన్నమాచార్యులు చిత్రపటాన్ని బహుకరించారు. శ్రీవారి ప్రతిమను అందజేసి శోభారాజుని గౌరవించారు. తెలుగు సంస్కృతి, సనాతన ధర్మం, ఆధ్యాత్మిక ప్రచారం, అన్నమయ్య సంకీర్తనా వైభవాన్ని భావితరాలకు అందించడంలో శోభారాజు చేస్తున్న సేవలను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు.








