#RAPO23- పాండిచ్చేరిలో జోరుగా సాగుతున్న షూటింగ్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం #RAPO23. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం చిత్ర యూనిట్ పాండిచ్చేరిలో కీలక షెడ్యూల్‌ను చిత్రీకరిస్తోంది. 15 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో అందమైన లొకేషన్లలో ఓ విజువల్ ట్రీట్‌లా ఉండే పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు. అలాగే ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కాంతార’, ‘కరుప్పు’ చిత్రాలకు యాక్షన్ కంపోజ్ చేసిన ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్ డిజైన్ చేస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారు.
హీరోగా నటిస్తూనే దర్శకుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ్ పోతినేని, ఈ షెడ్యూల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సినిమా విజన్‌కు తగ్గట్టుగా ప్రతి సన్నివేశాన్ని అత్యున్నత స్థాయిలో తెరకెక్కించేందుకు మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
#RAPO23 విభిన్నమైన సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్. నియో-నోయర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. జాతీయ అవార్డు గ్రహీత తిరునవుక్కరసు (తిర్రు) సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సామ్ సీఎస్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు. పీటర్ హైన్, విక్రమ్ మోర్ కలిసి యాక్షన్ ఎపిసోడ్స్‌ను రూపొందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ రూపొందిస్తున్న భారీ సెట్స్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
విభిన్నమైన కథ, భారీ నిర్మాణ విలువలు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల బృందంతో రూపొందుతున్న #RAPO23, రామ్ పోతినేని కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా నిలవబోతోంది.








