మూడు భారీ హాలీవుడ్ సినిమాల మధ్య కింగ్ రిలీజ్.. షారుఖ్ కాన్ఫిడెన్స్‌కు ఇదే నిదర్శనమా?
2026 క్రిస్మస్ సీజన్ బాక్సాఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. షారుఖ్ ఖాన్(Shah rukh khan) హీరోగా రూపొందుతున్న కింగ్(King) సినిమాను డిసెంబర్ 24, 2026న రిలీజ్ చేయాలనే డెసిషన్‌ను మేకర్స్ కంటిన్యూ చేస్తున్నట్టు తాజా ఇండస్ట్రీ వర్గాల సమాచారం చెబుతోంది. రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ, ప్రస్తుతానికి ఆ డేట్ లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఇండియన్ మార్కెట్లో షారుఖ్‌కు ఉన్న భారీ క్రేజ్, బాలీవుడ్ సినిమాగా కింగ్ కు ఉన్న ఆధిక్యం ఈ డెసిషన్ కు మెయిన్ రీజన్స్ గా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే ఈ రిలీజ్ కు ఛాలెంజెస్ కూడా తక్కువగా లేవు. అవెంజర్స్: డూమ్స్‌డే(Avengers Dooms day) తో పాటు డ్యూన్ పార్ట్ 3(Dune part3), జుమాంజీ 4(Jumanji4) వంటి భారీ హాలీవుడ్ సినిమాలు కూడా అదే టైమ్ లో థియేటర్లలోకి రానుండటంతో స్క్రీన్ల కేటాయింపుపై పోటీ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు పంపిణీదారులు, స్టూడియోల ఒత్తిళ్ల మధ్య ఏ సినిమాకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒకేసారి నాలుగు భారీ సినిమాలు రావడం వల్ల ప్రదర్శన వ్యవస్థపై ప్రభావం ఉండొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో మాత్రం కింగ్ రిలీజ్ చేయాలా లేదా అనే డిస్కషన్ కొనసాగుతోంది. కొందరు ప్రేక్షకులు పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రిలీజ్ డేట్ మార్చడం అభిప్రాయపడుతుండగా, షారుఖ్ అభిమానులు మాత్రం ఈ సినిమాపై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. పఠాన్, జవాన్ తర్వాత షారుఖ్ మరో భారీ సక్సెస్ ను అందుకునే అవకాశముందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కింగ్ క్రిస్మస్ బాక్సాఫీస్ పోరులో అత్యంత కీలక సినిమాగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.








