APNRT: ఎపిఎన్ఆర్టీ సొసైటీ చైర్మన్‌గా రవి వేమూరు నియామకం
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను మరోసారి భర్తీ చేసింది. ఇందులో భాగంగా విదేశాల్లోని ఎన్నారైలకు సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ సొసైటీకి ఛైర్మన్ గా డా.రవి వేమూరు (Dr. Ravi Vemuru) ను నియమించింది. ఆయన ఈ పదవిని చేపట్టడం ఇది రెండోసారి. గతంలో 2014-19 మధ్య ఏపీ ఎన్నార్టీఎస్ ఛైర్మన్ గా ఆయన పని చేసిన సంగతి తెలిసిందే. ఆయన సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఆయనకు మరోమారు చైర్మన్ పదవిని కట్టబెట్టడం విశేషం. తెనాలికి చెందిన రవి వేమూరు ఎన్నారై టీడీపీ నేతగా చాలా ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. రెండోసారి ఏపీఎన్నార్టీఎస్ ఛైర్మన్ గా ఎంపికైన డాక్టర్ రవి వేమూరుకు పలువురు ఎన్నారైలు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నారైల సహకారం తీసుకోవాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున ఎపిఎన్ఆర్టీ ఎస్‌ను గతంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా వారికి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వడంతోపాటు, ఏ రంగాల్లో వారి భాగస్వామ్యం అవసరమో కూడా వారికి తెలియజెప్పే బాధ్యతలను ఈ విభాగంపై ఉంచారు. ప్రపంచంలో ఉన్న తెలుగు ఎన్నారైలకు అవసరమైన సమాచారాన్ని ఈ సంస్థ అందజేస్తోంది.
తనకు మరోమారు ఈ సొసైటీ బాధ్యతలు అప్పగించినందుకు రవికుమార్ వేమూరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎపిఎన్ఆర్టీఎస్ ద్వారా ఎన్నారైలకు మరింత సేవలందించేందుకు కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఆయన నియామకంపై ‘తెలుగు టైమ్స్’ కూడా రవి వేమూరుకు ప్రత్యేకంగా అభినందనలను తెలియజేస్తోంది.








