తిరుపతి సభ తర్వాత ఆ విషయంపై ఎవరూ మాట్లాడరు
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తోన్న సభ దగాపడ్డ రైతుల సభే కానీ, రాజకీయ సభ కాదని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తిరుపతిలో జరుగుతున్న అమరావతి రైతుల మహోద్యమ సభకు రఘురామ హాజరయ్యారు. అంతకుముందు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న ఎంపీ రఘురామకు అమరావతి జేఏసీ నేతలు స్వాగతం పలికారు. రైతులకు మద్దతు కోసం అన్ని వర్గాలు తరలివస్తున్నాయన్నారు. సభ తర్వాత 3 రాజధానుల గురించి మాట్లాడేవారు ఎవరూ ఉండరని పేర్కొన్నారు. నూరు శాతం అమరావతే రాజధానిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అడ్డుకునే మేఘాలు అశాశ్వతమని, అమరావతే శాశ్వతం అని అన్నారు. న్యాయపరంగా 100 శాతం అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు అరువు మాటలని చెప్పారు. సత్తిబాబు చెడ్డవాడు కాదు, మంచి వాడని తాను అనడం లేదన్నారు. మనం జాలి పడాలి తప్ప బొత్స మాటలువిని బాధపడకూడదని తెలిపారు.













